
భారీ వర్షాలతో వరంగల్ జిల్లా అతకుతలం ….
జల దిగ్బంధంలో ఓరుగల్లు నగరం …
హైడ్రను గుర్తుచేసుకుంటున్న నగర ప్రజలు ..
వరంగల్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ); రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి.గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఓరుగల్లు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది దింతో జనజీవనానికి ఆటంకం ఏర్పడింది.వరంగల్ హన్మకొండ నగరాల్లో దాదాపు 40 కాలనీలు వరదలతో జలమమయ్యాయి.జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.వరంగల్ జిల్లాలో పలు గ్రామాల్లో కుంటలు చెరువులు పొంగి పొర్లాయి.కరీమాబాద్ కాశికుంట,వాంబే కాలనీల్లో నీరు ఇండ్లలోకి చొచ్చుకొచ్చాయి.బుధవారం ఏర్పడిన అల్పపీడనంతో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.విద్య సంస్థలకు రెండు రోజులు సెలవులు ప్రకటించారు.హైదరాబాద్ ల వరంగల్ లో హైడ్రా ఉంటె నాళాలను కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకునే వారని కాలనీల ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు .


