ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

దేవరకద్ర, ఏప్రిల్ 12( గోల్కొండ):మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో తాటికొండ సత్యనారాయణ ముదిరాజ్ కు చెందిన ఆర్ వి ఫంక్షన్ హాల్ ను ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని
చిన్న చింతకుంట మండలం పర్దిపూర్, పాల్యనాయక్ తండా లలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ కార్యక్రమాల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండ్ల యజమానులకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దేవరకద్ర నియోజకవర్గంలో పలువివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆమె ఆశీర్వదించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!