
ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న ప్రభుత్వం -దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్
అడవి అజిలాపురం, హజిలాపూర్ ల లో ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం
దేవరకద్ర, ఏప్రిల్ 12 (గోల్కొండ):ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు పాటుపడుతుందని మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జిఎంఆర్) అన్నారు. దేవరకద్ర మండలం హజిలాపూర్, అడవి అజిలాపూర్ గ్రామాలలో ఆదివారం ఎమ్మెల్యే జిఎంఆర్ ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నిరుపేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వారి సొంతింటి కలలు నిజం చేయడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే పలు వివాహ వేడుకల్లో కూడా దేవరకద్ర ఎమ్మెల్యే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
TAGS Hot News


