దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే  పాడి కౌశిక్ రెడ్డి

దసరా వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

 

వీణవంక, అక్టోబర్02(గోల్కొండ):
మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లో నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి జమ్మి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రం లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యుల తో గ్రామస్థుల తో కలిసి చౌదరి గద్దె వద్ద పూజలు చేసి దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ విజయదశ వేడుకలు అందరికీ విజయాలను కలిగించాలని కోరుకున్నారు..
వీణవంక లో ‘మహిషాసుర సంహార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు. మండల కేంద్రం లోని స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో మహిషాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు..ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నీల కుమార్ మాజీ వైస్ ఎంపీపీ రాయిశెట్టి లత శ్రీనివాస్,భానుచందర్,తాళ్లపల్లి మహేష్, పున్నం చందర్ తో పాటు నాయకులు గ్రామస్థులు పాల్గొన్నారు.,

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!