
తెలంగాణాకి వాతావరణ శాఖ హెచ్చరిక
హైదరాబాద్ ఆగస్టు 13 (గోల్కొండ న్యూస్ నెట్ వర్క్ ): తెలంగాణ అంతటా నాలుగు నుంచి ఐదు రోజుల పాటూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీచేసింది.బుధ గురువారాల్లో రెడ్ అలెర్ట్ జారీ చేసింది .వాతావరణ శాఖ వివరాలు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న మీడియాకు వివరించారు.హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతీ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. సంగారెడ్డి వికారాబాద్ ,మెదక్ యాదాద్రి భువనగిరి ,మేడ్చల్ మల్కాజ్గిరి ,ఖమ్మం భద్రాద్రి భూపాలపల్లి ,ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీచేసింది .మిగితా జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలెర్ట్ జారీచేశారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అప్రమత్తమైన జిఎచ్ఎంసి అధికారులు
వాతావరణ శాఖ హెచ్చరికలతో జిఎచ్ఎంసి అధికారులు అప్రమత్తమైనరు అధిక వర్షాలు సాయంత్రం నుంచి పడే అవకాశం ఉండడంతో ఎమర్జెన్సీ బృందాలను సిద్ధం చేసింది .ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకి రావద్దని మ్యాన్ వోల్స్ఎవరు తెరవద్దని సూచించారు.


