
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ…. టీయూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్
మంచిర్యాల సెప్టెంబరు 04 (గోల్కొండ ):
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని తెలంగాణ ఉద్యమ జర్నలిస్ట్ ల ఐక్య వేదిక (టీయుజేఐ)రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనార్దన్ పేర్కొన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోనీ సీ సీసీ నస్పూ ర్ లో నీ శ్రీ లక్ష్మీ గణేష్ వినాయక మండపం లో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతం నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా లక్ష్మీ గణేష్ మండలి నిర్వహణ కమిటీ నిర్వాహకులు, జనార్దన్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు వినాయక చవితి పండుగ అద్దం పడుతుందని పేర్కొన్నారు. అన్నివర్గాల ప్రజలు ప్రేమను రాగాలతో కలిసి జరుపుకునే పండుగ వినాయక చవితి అన్నారు.ఈ కార్యక్రమం లో భక్తులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ఘనంగా కుంకుమ పూజలు….
తరలి వచ్చిన మహిళలు..
జిల్లాకేంద్రంలోనీ సీ సీసీ నస్పూ ర్ లోనీ శ్రీ లక్ష్మీ గణేష్ వినాయక మండపం లో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు.. గోదావరి కాలనీ చౌరస్తా వద్ద కొలువైన లంబోదరుని వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి, ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. గణనాథుని వద్ద మహిళలు కోలాటాలు ఆడి భక్తులను అలరించారు.


