
జమ్మూ కాశ్మీర్ లో క్లౌడ్ బరెస్ట్ 33 మంది మృతి
శ్రీనగర్, ఆగస్ట్ 14 (గోల్కొండ ): జమ్మూ కాశ్మీర్ కిష్టావర్ జిల్లా పద్దార్ సబ్ డివిజన్ పరిధిలోని చిషోటీ గ్రామ పరిసర ప్రాంతంలో గురువారం క్లౌడ్ బరెస్ట్ సంభవించింది. ఆ క్రమంలో 33 మంది మరణించారు.దాదాపు 200 మంది గల్లంతయ్యారు.సంఘటన జరిగిన ప్రాంతంలో 1000 నుంచి 1200 మంది ఉన్నట్టు సమాచారం పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మాచైల్ మాతా యాత్ర మార్గంలో ఈ గ్రామం ఉండడంతో మృతుల సంఖ్య మరింతగా పెరగవచ్చని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.క్లౌడ్ బరెస్ట్ ఘటన పై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు.ప్రస్తుత పరిస్థితి సహాయక చర్యల పై అరా తీశారు.
అలాగే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భద్రతా దళాలు, పోలీసులు సంయుక్తంగా ఈ సహాయక చర్యలో పాల్గొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అయితే ఈ వర్షాల కారణంగా మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కిష్టావర్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ కుమార్ శర్మ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.


