
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వేడుకల నిర్వాహకులు ఎంపీ ని ఘనంగా సన్మానించారు.ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ తో వివాదం తర్వాత మొదటి సరిగా ఈటల నియోజిక వర్గానికి రావడంతో కార్యకర్తలు నాయకులూ అభిమానులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు.అనంతరం ఉట్టికొట్టిన వారికీ బహుమతులు అందజేశారు.కార్యక్రమ నిర్వాహకులని అభినందించారు.అనంతరం వల్బాపూర్ ,కనపర్తి ,హిమ్మత్ నగర్ ,మామిడాలపల్లి , ఎల్బాక గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యుల ను పరామర్శించి మృతి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఈటల పర్యటనకు కేంద్ర మంత్రి వర్గం దూరం

ఎంపీ ఈటల రాజేందర్ హుజురాబాద్ నిజయోజిక వర్గం వీణవంక మండలంలో శనివారం పర్యటించగా మండల బీజేపీ కమిటీ సభ్యులు అధ్యక్షుడు,మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సంజయ్ వర్గం గా ఉన్నవారు పూర్తిగా దూరముగా ఉన్నారు.ఈటల పర్యటనతో మరోసారి బీజేపీ లో వర్గ విభేదాలు బయటపడ్డాయి.పర్యటనలో లేని కొంత మంది నాయకులను వివరణ అడుగగా తమకు పర్యటన సమాచారం లేదని అందుకే దూరంగా ఉన్నామని సమాచారం ఇచ్చారు.


