
కన్నులుండి చూడలేని కబోధి కౌశిక్ రెడ్డి.. వొడితల ప్రణవ్.
నియోజకవర్గ వ్యాప్తంగా కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు.
పలు గ్రామాల్లో మొదలైన ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు.
సంక్షేమం,ఆదర్శవంతమైన పాలన కాంగ్రెస్ విధానం.
కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని,మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 3,500 ఇండ్లు మంజూరు అయ్యాయని,కౌశిక్ రెడ్డి సొంత మండలం వీణవంకలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తై గృహ ప్రవేశాలు చేస్తున్నారని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు.ఆదివారం నియోజిక వర్గం కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుడు సారయ్య నిర్మించుకుంటున్న ఇంటిని పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ పదేండ్ల కాలంలో డబుల్ బెడ్ రూంల పేరుతో కాలయాపన చేసి ఒక్క ఇల్లు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా,కనీసం కట్టిన డబుల్ బెడ్ రూం ఇండ్లను పంచలేని స్థితిలో ఉండి ఇప్పుడు గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి దఫాల వారిగా వారికి సహాయం చేస్తుంటే ఆది చూసి ఓర్వలేని కౌశిక్ రెడ్డి ప్రజలను సోషల్ మీడియా వేదికగా అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దఫల వారిగా అర్హులైన అందరికీ ఇళ్ళు ఇస్తామని ఇప్పటికే చెప్పామని కన్నులు ఉండి చూడలేని స్థితిలో కౌశిక్ రెడ్డి ఉన్నాడనీ దుయ్యబట్టారు.ప్రభుత్వం పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని,ప్రజా సమస్యలు పట్టించుకొని కౌశిక్ రెడ్డి ప్రజల పట్ల కపట ప్రేమ నటిస్తున్నాడని అన్నారు.నియోజిక వర్గంలో పలు వివాహ శుభకార్యాలయాల్లో పాల్గొని నూతన వధువరులను ఆశీర్వదించారు.అలాగే నియోజిక వర్గంలోని పలు మండలాల్లో ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


