కన్నుల పండుగగా దసరా వేడుకలు

కన్నుల పండుగగా దసరా వేడుకలు

యుప్ టీవి సీఈఓ పాడి ఉదయ్ నందన్ రెడ్డి నివాసం లో దసరా వేడుకలు

వీణవంక, అక్టోబర్ 02(గోల్కొండ)

మండల వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రం లో యుప్ టీవీ సీఈవో పాడి ఉదయానందన్ రెడ్డి తన నివాసంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు..మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.ఈ విజయదశ వేడుకలు అందరికీ విజయాలను కలిగించాలని కోరుకున్నారు.అనంతరం చిన్నారి సహశ్రీ కుచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.గ్రామస్థులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటీసి దాసారపు ప్రభాకర్, సమ్మిరెడ్డి, అమృత ప్రభాకర్, దాసారపు రాజు, సమీడ్ల చిట్టీ, తాళ్లపల్లి కుమార్ స్వామి,లోకేష్, రాకేష్, కుమార్,రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!