గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ చర్యలు

నిఘా నీడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర
నిమజ్జననం జరిగే, శోభయాత్ర రూట్ ప్రదేశాలను పరిశీలించిన పోలీస్ కమీషనర్.

మంచిర్యాల సెప్టెంబరు ౦4 (గోల్కొండ ): గణేశ్ నవరాత్రులు ముగించుకొని రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ లో వివిధ ప్రాంతాల వద్ద నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా, ఎలాంటి అవాంచనియా సంఘటనలు, ప్రమాదాలు జరగకుండా పటిష్టమైన భద్రత, బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరిగిందని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. తాండూర్, బెల్లంపల్లి చెరువు వద్ద, మంచిర్యాల పట్టణం లో నిమజ్జన శోభా యాత్ర జరిగే రూట్, పెద్దపల్లి జోన్ పరిధిలో గోదావరి బ్రిడ్జ్ వద్ద నిమజ్జనం పాయింట్ ను పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల డీసీపీ భాస్కర్ పోలీస్, ఇతర ప్రభుత్వ శాఖ ల అధికారులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ మంచిర్యాల జోన్ పరిధిలో వినాయక నిమజ్జనం, శోభయాత్ర బందోబస్తు మంచిర్యాల జోన్ పరిధిలో 2334 పెద్దపల్లి జోన్ పరిధిలో 2524 మొత్తం 4858 వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. అట్టి విగ్రహాలను ప్రధానంగా కమీషనరేట్ పరిధిలో 47 నిమజ్జన ప్రాంతాలు అందులో మంచిర్యాల జోన్ లో ఎక్కువ విగ్రహాలు రాయపట్నం బ్రిడ్జి గూడెం, గోదావరి పుష్కర ఘాట్ లక్షట్ పేట్, గౌతమేశ్వర టెంపుల్ మంచిర్యాల, ఇంటెక్ వెల్ సీతారాంపల్లి, ఇందారం, గోదావరి బ్రిడ్జి, పెద్ద చెరువు చెన్నూర్, పోచమ్మ చెరువు బెల్లంపల్లి అదేవిదంగా పెద్దపల్లి జోన్ లో గోదావరి బ్రిడ్జ్, మంథని గోదావరి వద్ద, పెద్దపల్లి ఎల్లమ్మ చెరువు మినీ ట్యాంక్ బండ్, సుల్తానాబాద్ చేరువు లలో నిమజ్జనం చేయడం జరుగుతుందని పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పోలీసు పికెట్లు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మత్తు, ప్లడ్ లైట్లు, క్రేన్లు, ఫ్లాట్ ఫామ్స్, మంచినీటి వసతి ఏర్పాటు చేశామని, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో గజ ఈతగాళ్ల అందుబాటులో ఉంటారన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేయడం జరిగింది అన్నారు. అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో గణేష్ నిమజ్జన ఊరేగింపు ఉంటుందన్నారు. నిమజ్జన శోభాయాత్ర కు సంబంధించి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించడం జరుగుతుందని ఎక్కడైనా ట్రాఫిక్ సమస్య ఏర్పడిన లేదా శోభాయాత్రలో వాహనాల మూమెంట్ ను పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. గణేష్ ఉత్సవ కమిటీలు త్వరిత గతిన పూజలు ముగించి వెలుతురు ఉండగానే తమ విగ్రహాలను జాగ్రత్తగా తరలించాలని ఊరేగింపులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చిన్న పిల్లలు మహిళలు శోభ యాత్ర లో పాల్గొంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని అలాగే ట్రాక్టర్ల, లారీల పై, ఇతర వాహనాలపై వచ్చే చిన్నారులు జాగ్రత్తగా ప్రయాణించాలని కాళ్లు చేతులు క్రిందకు వేలాడస్తు ప్రయాణం సాగించవద్దని పొరపాటున కాలుజారి పడిపోతే ప్రమాదం సంభవిస్తుందని అన్నారు. నిమజ్జన సమయంలో పోలీసు వారి యొక్క సూచనలకు అనుగుణముగా నిర్వాహకులు, ఉత్సవ కమిటీ సభ్యులు నడుచుకొని ప్రశాంతముగా నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యేలా సహాయ సహకారాలు అందించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు సమయంలో డీజేలు, బాణాసంచా కాల్చడం వంటివి నిషేధమని సూచించారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తిశ్రద్ధలతో నవరాత్రులను ముగించుకొని ఆఖరున జరిగే నిమజ్జన కార్యక్రమాన్ని మత సామరస్యంతో,శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.తాండూర్ మండల కేంద్రంలోని ఐ.బి. ప్రాంతంలో ఏర్పాటు చేసిన శ్రీ గణేష్ మండలిని సందర్శించి సీపీ కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు.సీపీ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్ ., బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, సీఐ, ఎస్ఐ లు, ఇతర ప్రభుత్వ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!