
జాతి అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుదాం
– ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు లల్లు ముదిరాజ్
హైదరాబాద్, గోల్కొండ (అక్టోబర్ 26): ముదిరాజులపై భంగపాటును సహించమని, ఆత్మగౌరానికి దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే తిరిగి బుద్ధి చెప్పాల్సి ఉంటుందని అది మంత్రులైన ఇతర కుల సంఘాల పెద్దలైన మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలని, రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న ముదిరాజుల హక్కుల సాధనకు నిరంతర ఉద్యమం చేయడం తమ కర్తవ్యం మనీ, జాతి అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు సాగుతామని, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు లల్లు ముదిరాజ్ పైల్వాన్ ఆదివారం స్పష్టం చేశారు. బి, సి, డి నుండి ఏ లోకి మార్చే వరకు తమ పోరాటం ఉంటుందని, దీనివల్ల ముదిరాజు యువత ఉద్యోగ, ఉపాధి, రక్షణ, విద్య, ఆర్థిక స్వాలంబనను కోల్పోతున్నారని సాధన దిశగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు. పళ్ళ తోటలో ,మత్స్య సంపద సౌకర్యాలకు రుణాలు వస్తువులను, సబ్సిడీల కింద తమ కులస్తులకు అందించాలని దానికోసం మంత్రి శ్రీహరి ద్వారా విన్నవించనున్నట్లు లల్లు చెప్పారు. హక్కుల సాధన కోసం చిత్తశుద్ధితో ముందు కదులుతామని ముదిరాజ్ కులస్తులు సైతం సంఘటితంగా తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.


