
వేలం పాటలో లడ్డు కైవసం చేసుకున్న భక్తులు
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, చందు లేఔట్ పరిధిలోని రాఘవేంద్ర బృందావనం అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లడ్డు వేలంపాటను కమిటీ సభ్యులు నిర్వహించారు. ఈ వేలం పాటలో డి వెంకటేశ్వరరావు, కె కార్తికేయ శివ లు లడ్డును 1,10,116 రూపాయలకు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కమిటీ సభ్యులు సన్మానించారు.


