క్రెడయి చాప్టర్  ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ

ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు
మంచిర్యాల ఆగస్టు 27 (గోల్కొండ ):మంచిర్యాల పట్టణంలో క్రెడయి చాప్టర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ బిల్డర్ అసోసియేషన్ చేశారు. ఈ సందర్భంగా క్రెడయి చాప్టర్ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు పూరెల్ల పోచమల్లు మాట్లాడారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు మట్టి గణపతులే ముద్దు అన్నారు. కాలుష్య రహిత మట్టి గణపతుల వాడకంతో వాతావరణ మార్పులకు అవకాశం ఉండదన్నారు. హైందవ సంస్కృతిని కాపాడుతూనే వాతావరణాన్ని రక్షణ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వినాయక ప్రతిమలు పెద్ద సంఖ్యలో పట్టణ వాసులకు అందించారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, కోశాధికారిగ శ్రీనివాస్,ఎలెక్టెడ్ అధ్యక్షులు పిల్లలమర్రి వంశీ , చైర్మన్ పున్నం చంద్, రాష్ట్ర సభ్యులు నరసింహారెడ్డి, దినేష్ కుమార్, సీనియర్ సభ్యులు ముఖేష్, అధికార ప్రతినిధి దబ్బేట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!