కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది

కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది

– కేంద్రం పరిధిలో నాన్చివేత
– వెంటనే పరిష్కరించాలని డిమాండ్
– టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రహమత్ హుస్సేన్

మంచిర్యాల:  కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట నిలుపుకుంది. బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నామని, దానికి నిదర్శనం అసెంబ్లీ తీర్మానమని, కేంద్రం పరిధిలో నాన్చివేత జరుగుతుందని,  వెంటనే పరిష్కరించాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్ రహమత్ హుస్సేన్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల్లో ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీని పారదర్శకంగా సర్వే నిర్వహించి బీసీ బిల్లును ఆమోదపరిచి కేంద్రానికి పంపితే, రాష్ట్రపతి దగ్గర నుండి, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం రాకపోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడి బీసీ 42 శాతం హక్కును సాధించే బాధ్యతను తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు తూముల నరేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ లు, మాజీ కౌన్సిలర్లు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!