కన్నుల పండుగగా అయ్యప్ప పడి పూజ ..

కన్నుల పండుగగా అయ్యప్ప పడి పూజ ..

హైదరాబాద్ డిసెంబరు 26 (గోల్కొండ ):కన్నుల పండుగగా అయ్యప్ప పడిపూజ కార్యక్రమం చేపట్టారు. ఎల్ బి నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ లోని మోహనగర్ లో ప్రజయ్ నివాస్ ఫేజ్ 2 లోని 7 వ బ్లాక్ లో అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ రాము ఆధ్వర్యంలో అయ్యప్ప పడి పూజ కన్నుల పండుగగా నిర్వహించారు .ప్రత్యేక వేదికపై అయ్యప్ప, గణప తి, ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించారు. పంచామృత అభిషేకం నిర్వహించి అర్చన, అష్టోత్తర శతనావలి జరిపారు. పదునెట్టాంబడిపి ప్రత్యేక పూజలను నిర్వహించిన గురుస్వామి అయ్యప్ప స్వాములచే కర్పూర హరతులను అందించారు. ఈ సందర్బంగా అయ్య ప్ప స్వాములు చేసిన భజనలతో ఆ ప్రాతం భక్తి గీతాలతో మారు మో గింది.  అయ్యప్ప స్వాములకు బిక్షను అందిం చా రు.ఈ కార్యక్రమంలో గురు స్వాములు వెంకటరమణ ,శ్రీధర్ ,శ్రీను ,స్వాములు రాము ,చందు ,విను ,వినీత్ ,కిషన్ పవన్ ,పాపారావు ,కాలనీ సభ్యులు శంకర్ రావు ,తిరుమల్, నరసింహ ,శ్రీనివాస్ రెడ్డి, జి ఎస్ ,సురేష్ ,ఎల్లన్న ,రహమాన్ ,రామచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!