
బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా , ఆగస్టు 27 (గోల్కొండ ప్రతినిధి):బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి స్వయంగా వినాయకుడిని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఉండాలని దేవుని ప్రార్థించారు. ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో విఘ్నాలని తొలగాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు. విఘ్నాలు తొలగించే గణనాధుని ప్రజలంతా తమ ఇండ్లలో భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని తగు జాగ్రత్తలు పాటిస్తూ, తమ ఇండ్లలో గణేష్ నవరాత్రులు జరుపుకుని లంబోదరుని ఆశీర్వాదం పొందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,తాజా మాజీ ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు
TAGS Hot News


