చల్లూరులో కేంద్ర బలగాల కవాతు

చల్లూరులో కేంద్ర బలగాల కవాతు

 

 

కరీంనగర్ ఆగస్టు 23( గోల్కొండ ).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో కరీంనగర్ సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు రానున్న గణేష్ నవరాత్రులు, దుర్గ మాత నవరాత్రులు, రానున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆర్ ఎ ఎఫ్ కు కరీంనగర్ కమీషనరేట్ ఎస్ఏటి లోకల్ పోలిస్ సిబ్బంది కవాతు లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాపిడ్ ఆంటీ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టీ పి భగిల్ మాట్లాడుతూ.. తెలంగాణ లో గ్రామ గ్రామాన శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయంగా కవతు లు నిర్వహిస్తామని, గ్రామాలలో శాంతి భద్రతల కోసం రాజకీయ నాయకులు, మాజీ సర్పంచులు, యువత శాంతియుత మార్గంలో గ్రామాన్ని సంరక్షించుకోవాలని, గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ప్రతి ఒక్కరూ ఒక జవాన్ లాగా మారి బాధ్యతతో దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు. 99 ఆర్ ఏ ఎఫ్ బ్యాచ్ కవాతు లో భాగంగా స్వగ్రామానికి విచ్చేసిన జవాన్ ను చల్లూరు గ్రామ ప్రజలు సగర్వంతో స్వాగతం పలుకుతూ.. పూలమాలలు వేస్తూ, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం జవాన్ మాట్లాడుతూ.. కవత్తులో భాగంగా స్వగ్రామానికి రావడం నాకు గర్వకారణంగా ఉందని, దేశం కోసం నాలాంటి యువకులు ఆర్మీకి కదలి రావాలని, భరతమాత సంరక్షణకై మనందరం బాధ్యతగా ఉండాలన్నారు. ఈ కవాతు ను ముఖ్య అతిధి గా జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీ నారాయణ ప్రారంభించగా ఆర్ ఏ ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ టిపి భగీల్, వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి ,జమ్మికుంట ఎస్సై నాగరాజు , ఇల్లందకుంట ఎస్సై క్రాంతి మండల ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!