
సూచీలకు భారీ లాభాలు…
ముంబై ..ఆగస్టు 18 :
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు.
గత వారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ సూచీలు ఈ వారాన్ని భారీ లాభాలతో ప్రారంభించాయి. జీఎస్టీలో సంస్కరణలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపు విషయంలో గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉందన్న వార్తలు వస్తుండడంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. అంతర్జాతీయంగా సానుకూలాంశాలు కూడా కలిసి రావడంతో సెన్సెక్స్, నిఫ్టీ లాభాలతో రోజును ముగించాయి.
సెన్సెక్స్‌లో మారుతీ సుజుకీ, అశోక్ లేలాండ్, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, బ్లూస్టార్ షేర్లు లాభాలను ఆర్జించాయి. గ్లన్‌మార్క్, సుజ్లాన్ ఎనర్జీ, కల్యాణ్ జువెల్లర్స్, భెల్, టొరెంట్ పవర్ షేర్లు నష్టాల బాటలో నడిచాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 608 పాయింట్లు లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ 393 పాయింట్లు ఆర్జించింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 87.35గా ఉంది.గత శుక్రవారం ముగింపు (80, 5979)తో పోల్చుకుంటే సోమవారంవారం ఉదయం దాదాపు 700 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఒక దశలో 1200 పాయింట్లకు పైగా లాభపడి 81,765 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు సెన్సెక్స్ 676 పాయింట్ల లాభంతో 81, 273 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 245 పాయింట్ల లాభంతో 24, 876 వద్ద స్థిరపడింది.


