విష జ్వరాల పుకార్లు నమ్మవద్దు… డాక్టర్ వరుణ

విష జ్వరాల పుకార్లు నమ్మవద్దు… డాక్టర్ వరుణ

బేతిగల్ ఉచిత వైద్య శిబిరం లో తేలిన జాండిస్ కేసులు 3 మాత్రమే
గ్రామస్థులు ఎవరు భయపడవద్దు… వైద్యులు
కరీంనగర్ ఆగస్టు 17 (గోల్కొండ ): కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో పదుల సంఖ్య లో జాండిస్ కేసులు నమోదు అయినవాన్ని కేవలం ప్రచారం మాత్రమే అని వైద్యులు నిర్దారించారు.ఆదివారం బేతిగల్ గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.డాక్టర్ శ్రావణ్ ,డాక్టర్ వరుణ లు ఇంటి ఇంటి ఫీవర్,జాండిస్ సర్వే నిర్వహించారు. దాదపు 38 ఇండ్లల్లో 83 మంది కి స్క్రీన్ టెస్ట్ లు నిర్వహించినట్టు వైద్యులు తెలిపారు. 14 మందికి డెంగ్యూ రాపిడ్ టెస్టులు చేయగా నెగిటివ్ వచ్చినట్టు తెలిపారు. నెల వ్యవధిలో ముగ్గురికి మాత్రమే జాండిస్ వచ్చినట్టు నిర్దారణ అయినట్టు తెలిపారు .వచ్చిన ముగ్గురు జమ్మికుంట లోని ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లగా ఇద్దరు వెళ్లిన ఆసుపత్రిలో వెంటనే తగ్గగా మరో ఆసుపత్రిలో కొంత సమయం తీసుకోవడంతో ఆందోళన చెందారని వారు కోలుకున్నారని తెలిపారు.గ్రామంలో శానిటేషన్ సరిగ్గా లేక పోవడంతో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు పరిసరాలు పరి శుభ్రంగా ఉంచుకోవాలని వీధిలోని డ్రైనేజీ లు తరుచు శుభ్ర పరిచి బ్లీచింగ్ చల్లాలని సూచించారు .జ్వరం దగ్గు ఒళ్ళు నొప్పులు వస్తే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి మందులు తీసుకోవాలని సూచించారు.గ్రామస్థులు ఎవరు భయపడవద్దని మూడు రోజులు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి అందరికి ఆరోగ్య పరీక్షలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమాలో డాక్టర్ శ్రావణ్ ,డాక్టర్ వరుణ,డాక్టర్ రజినీకాంత్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!