ప్రధాని మోదీ అబద్ధాల కోరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్

ప్రధాని మోదీ అబద్ధాల కోరు….కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేశ్

ఢిల్లీ ఆగస్టు 16 (గోల్కొండ):
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, సమాచార విభాగం అధినేత జైరామ్ రమేశ్ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇచ్చిన ప్రసంగంలో.. ఇండియా సెమీ కండక్టర్ చరిత్ర గురించి తప్పుడు ఆరోపణలు చేశారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ అబద్ధాల కోరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు జైరామ్ రమేశ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.ప్రధాని మోదీ అబద్ధాల కోరు అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. సెమీ కండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ చండీగఢ్‌లో ఏర్పాటైంది. 1983లో ఆపరేషన్స్ మొదలయ్యాయి’ అని అన్నారు. ఆ పోస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా జోడించారు. ఆ వీడియోలో నరేంద్ర మోదీ సెమీ కండక్టర్ల గురించి మాట్లాడారు. ‘నేను టెక్నాలజీకి సంబంధించిన పలు విషయాల గురించి మాట్లాడినపుడు.. సెమీ కండక్టర్ల గురించిన ఉదాహరణను మీ దృష్టికి తీసుకువస్తాను అని అన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!