ఘనంగా వొడితల  ప్రణవ్ జన్మదిన వేడుకలు…

ఘనంగా వొడితల ప్రణవ్ జన్మదిన వేడుకలు…

నియోజకవర్గ వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అభిమానులు.
కరీంనగర్ ఆగస్టు 15 (గోల్కొండ ):హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్
ప్రజా సంక్షేమం ఆకాంక్షించి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ సమయంలో,ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల గుండెల్లో నిలిచే నాయకునిగా ఎదిగిన నాయకునిగా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజిక వర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు నియోజిక వర్గంలో గుర్తింపు తెచ్చుకున్నారు.నియోజిక వర్గంలోని వీణవంక జమ్మికుంట హుజురాబాద్ ,కమలాపూర్ ,ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో అభిమానులు కాంగ్రెస్ నాయకులూ కార్యకర్తలు కేకులు కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.అనంతరం హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం కోసం కృషి చేసిన వారిని స్మరించుకోవాలని,వారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు వెళ్ళాలని సూచించారు.దేశ స్వాతంత్రం రోజు తన పుట్టిన రోజు కావడం సంతోషంగా ఉందని,కార్యకర్తలు అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేదని అన్నారు.నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టి చూసుకుంటానని అన్నారు.
రక్తదాన శిబిరాలు ఏర్పాటు.
జన్మదిన సందర్భంగా హుజూరాబాద్,జమ్మికుంట పట్టణాల్లో మండల,యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరాల్లో ఆయన పాల్గొన్నారు.
దేవాలయాల్లో ప్రత్యేక పూజలు..
హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ జన్మదిన సందర్భంగా తన స్వగ్రామం సింగపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం హుజూరాబాద్ పట్టణంలోని హనుమాన్ దేవస్థానంలో,అపర భద్రాద్రి ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామిదేవాలయంలో,జమ్మికుంట పట్టణంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉచిత అన్నదాన కార్యక్రమాలు
ప్రణవ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు అభిమానులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.నియోజకవర్గవ్యాప్తంగా పలు కూడలిలో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు.ప్రభుత్వ దవాఖానలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు .

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!