
గ్రామల అభివృద్ది కాంగ్రెస్ తోనే సాధ్యం .ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ
కరీంనగర్ ఆగస్టు 13 (గోల్కొండ ప్రతినిధి ):
గ్రామాల అభివృద్ది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారయణ అన్నారు .కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గొల్లపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించరు .ప్రజా ప్రభుత్వంలోనే ప్రతి పేదవాడి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. అనంతరం రైతు వేదిక భవనంలో పలు గ్రామల కు ముఖ్యమంత్రి సహయ నిధి ,కల్యాణ లక్ష్మీ చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెసు పార్టీ అద్యక్షుడు బసవయ్య ,నాయకులు శ్రీనివాసు గౌడ్ ,మర్కెట్ వైస్ చైర్మన్ తిరపతి ,ఎంపీడీఓ కృష్ణ ప్రసాద్ ,డిఈ రవి ప్రసాద్ ,ప్రతేక్య అధికారి కమలాకర్ రెడ్డి తదితరులున్నారు.
TAGS Hot News


