
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డ్రగ్ కంట్రోల్ రెగ్యులేటరీ స్ట్రేంథింగ్ డే..
పెద్దపల్లి, ఏప్రిల్11,(గోల్కొండ):పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సముదాయంలో ని హల్ లో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ఆధ్వర్యంలో Drug control & regulatory strength
eing Day నిర్వహించడం జరిగింది.డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీ పి.శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపెల్లి జిల్లా జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ , విశిష్ట అతిథిగా తెలంగాణ ఈగల్ టీం ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్ , ట్రినిటీ ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రభాకర్ మరియు అధిక సంఖ్యలో కెమిస్ట్లు మరియు ఫార్మాసిస్టులు పాల్గొని విజయవంతం చేసినారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అలవాటు కలిగించే ఔషధాల దుర్వినియోగం (Habit Forming Drugs), షెడ్యూల్ H / H1 ఔషధాల నియంత్రణ, QR కోడ్ వెరిఫికేషన్, (ADR ), లైసెన్స్ వెరిఫికేషన్ పై అవగాహన కల్పించడం జరిగింది మరియు ఈగల్ టీం డ్రగ్స్ మరియు ఇతర దురాలవాట్లు (నిషేధిత మత్తు పదార్థాలపై) అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్ డ్రాగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు మాడురీ వినోద్ కుమార్,ప్రధాన కార్యదర్శి
కజంపురం రాజేందర్,కోశాధికారిపోలు సతీష్,పెద్దపల్లి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు, ఫారసీస్ట్ లు,ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు.


