వనం నుండి జనంలో ని  గద్దెల వద్ద కు  చేరిన ..సమ్మక్క రాక

వనం నుండి జనంలో ని గద్దెల వద్ద కు చేరిన ..సమ్మక్క రాక

భక్త జనంతో నిండిన జాతర ప్రాంగణం ..

వీణవంక మినీ మేడారంలో మొదలైన జాతర…..

వీణవంక, జనవరి29(గోల్కొండ)

వీణవంక మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన సమ్మక్క-సారలమ్మ జాతర అట్టహాసంగా బుధవారం నుండి మొదలు కాగా గురువారం భక్తుల జయజయధ్వానాలు, పూజారుల మంత్రోచ్ఛారణల మధ్య సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోను మార్గం లో జాతర మార్గం పోలీస్ బందోబస్తు మధ్య వనం నుండి పూజారులు సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమల తో వనాన్ని గద్దెల వద్ద కు పూజారులు అమ్మవారిని బాజాభజంత్రీలు, డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య భక్తజన సందోహం తోడురాగా గద్దెల వద్దకు బయలు దేరింది.. ఈ క్రమంలో భక్తులు పొర్లుదండాలు పెట్టి,అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు.భక్తులు భారీగా తరలివచ్చికొబ్బరికాయలు, పసుపు కుంకుమలు మరియు నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించి దర్శించుకోవడంతో వీణవంక మొత్తం భక్తి పారవశ్యంలో మునిగితేలుతోంది. భక్తుల సౌకర్యార్థం వివిధ శాఖల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. 1976 లో మొదలలైన జాతర నేటికి
యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా జాతర నిర్వహకులు పాడి రామ కృష్ణా రెడ్డి, పాడి ఉదయ్ నందన్ రెడ్డి లు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.సారలమ్మ సమ్మక్క అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకోవడంతో జాతర ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది.

వీణవంకజాతర.. పై సీపీ నజర్…..

వీణవంక మినీ మేడారం మహాజాతర వేళ భక్తుల భద్రతతో పాటు ట్రాఫిక్ నియంత్రణే లక్ష్యంగా పోలీస్ శాఖ అత్యాధునిక నిఘా ఏర్పాట్లు చేశారు..జాతర ప్రాంగణం వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా క్షణాల్లో గుర్తించేలా వ్యవస్థను సిద్ధం చేశారు. బుధవారం నుంచి ప్రారంభమైన మినీ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా వన దేవతల మార్గాల వద్ద నుండి గద్దెల వరకు కొనసాగే రోడ్డు మార్గం నుండి జాతర
వద్ద వచ్చే మార్గాన్ని కరీంనగర్ సీపి గౌస్ ఆలం పర్యవేక్షించారు.వీణవంక జాతర తీరును క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ చేయడంతో పాటు ఆయా సెక్టార్ అధికారులకు సీపీ పలు సూచనలు చేయడం తో పాటు భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!