కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత మారనుంది – జూబ్లీహిల్స్ ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత మారనుంది – జూబ్లీహిల్స్ ఇన్చార్జ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

– ఇప్పటికే 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు
– 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన మోసాల పరంపర

షేక్‌పేట, అక్టోబర్ 28 (గోల్కొండ ప్రతినిధి) : కాంగ్రెస్ గెలుపుతో జూబ్లీహిల్స్ రాత మారనుందని, ఇప్పటికే 50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు శరవేగంగా సీఎం రేవంత్ రెడ్డి వేగాన్ని పెంచారని మరింత మెరుగైన ఫలితాల కోసం కాంగ్రెస్ ను బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని, గత 10 ఏళ్ల బిఆర్ఎస్ పాలన మోసాల పరంపర తప్ప ఇంకేం లేదని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఇన్చార్జ్ కార్మిక శాఖ మంత్రి వివేక్ స్పష్టం చేశారు. ఇందిరమ్మ సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో పేదలకు అందాలంటే కాంగ్రెస్ గెలుపు తధ్యమని పేదల సైతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ను బలపరచడం హర్షించదగ్గ విషయమని మంత్రి అన్నారు. షేక్‌పేట డివిజన్లో కులాలకు అతీతంగా ప్రజలు కదలిరావడం ఓటు అభ్యర్థులను ఘనంగా స్వాగతించడం కాంగ్రెస్ పట్ల ప్రజల మమకారం ఇట్లే అర్థమవుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం లో ప్రజాస్వామ్య స్వేచ్ఛ తో ప్రజలు సుభిక్షంగా ఉంటారన్నారు. దానికి నిదర్శనం కాంగ్రెస్ నేతలకు ప్రజల బ్రహ్మరథమే కారణమన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇంచార్జి లు ఇంగు రవీందర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, డివిజన్ అధ్యక్షుడు డి సత్యనారాయణ, ప్రీతి, జ్యోతి, దయానంద్, రాజు, రమేష్, లడ్డు, శేఖర్, విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!