బేతిగల్ లో బస్సు సర్వీస్ ప్రారంభంతో.. గ్రామస్థుల సంబురాలు

బేతిగల్ లో బస్సు సర్వీస్ ప్రారంభంతో.. గ్రామస్థుల సంబురాలు


మంత్రి పొన్నం , ప్రణవ్ కృషి తో.. నెరవేరిన గ్రామస్థుల చిరకాల కళ

వీణవంక, అక్టోబర్2(గోల్కొండ)
రాష్ట్ర బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారం తో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ మండలం లోని భేతిగల్ గ్రామం లో నూతన బస్సు సర్వీసు ను బుధవారం రోజు ప్రారంభించారు.ఈ బస్సు జమ్మికుంట నుండి భేతిగల్, ఆముదాలపల్లి, మొలంగూర్ కేశపట్నం మీదుగా కరీంనగర్ కు మెదటి దఫా రోజుకు రెండు ట్రిప్పులు గా ప్రజలకు సౌకర్యం కలుగనుంది.గ్రామం లోని శ్రీ సీతారామ దేవస్థానం వద్ద గ్రామస్థులతో నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గ్రామస్థులతో కలిసి బస్సు కు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు.కాగా గత ఇరవై ఎండ్ల బస్సు సర్వీస్ కళ నెరవేరడం తో గ్రామస్థులు టపాసులు కాలుస్తూ, సంబురాలు చేసుకున్నారు.ప్రణవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్క హామీని నేరవేరుస్తారని అన్నారు. గతం లో అధికారం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు గ్రామాన్ని పట్టించుకోలేదన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి లబ్ధి జరుగుతుందన్నారు. అనంతరం గ్రామానికి సంబందించిన 4 సీఎంఆర్ ఎఫ్ చెక్కులను,వల్బాపూర్ కి 3 చెక్కులను అందజేశారు.గ్రామస్థుల సౌకర్యార్థం కోసం బస్సు ఏర్పాటు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, నియోజకవర్గ ఇంచార్జ్ ప్రణవ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామం అధ్యక్షుడు మడ్డి అనిల్ గౌడ్ మసాడి చొక్కారావు, అంబాల రంగయ్య,శ్రీ రామ్ ఐలయ్య,సీనియర్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి, సాహెబ్ హుస్సేన్, ఎల్లారెడ్డి, సతీష్ గౌడ్, రాకేష్ రెడ్డి,డైరెక్టర్ లు శ్రీపతి రెడ్డి, సునీల్, తో పాటు గ్రామస్థులు యూత్ నాయకులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!