నంది మేడారంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

నంది మేడారంలో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర

ధర్మారం, అక్టోబర్ 2 (గోల్కొండ): ధర్మారం మండలంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. మండల వ్యాప్తంగా తొమ్మిది రోజులపాటు విశేష పూజలు అందుకున్న దుర్గామాతను గురువారం గంగమ్మ ఒడికి సాగనంపారు. మండలంలోని నంది మేడారం గ్రామంలో శ్రీ దుర్గా మాత ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో చివరి రోజు అమ్మవారికి పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. సాయంత్రం అమ్మవారిని శోభయాత్రగా ఊరేగించి నిమజ్జనానికి తరలించారు. మహిళలు పురుషులతో పాటు పిల్లలు ఆనందోత్సాహాలతో అమ్మవారి శోభ యాత్రలో పాల్గొన్నారు. డీజే పాటలు, చప్పుళ్లకు మహిళలు ఏక రూప దుస్తులు ధరించి కోలాటం వేస్తూ, నృత్యం చేశారు. శోభ యాత్రలో దారి పొడవునా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. టెంకాయలు కొట్టి నీరజనాలు పలికారు. శోభాయాత్ర అనంతరం రాయపట్నం గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి అమ్మవారిని తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత సేవా సమితి సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!