మహాత్మా మన్నించు ….

మహాత్మా మన్నించు ….

ఎలక్షన్ కోడ్ అమలుకు ఆబ్కారీ అధికారుల నిరాకరణ …?
గాంధీ జయంతి రోజు గ్రామాల్లో ఏరులై పారుతున్న మద్యం …

కరీంనగర్ అక్టోబర్ 02 (గోల్కొండ ):మహాత్మ మన్నించు నీ జయంతి రోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు పట్టించుకోవాలిసిన అధికారులు తమకేమి పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా మద్యం ,మాంసం దుకాణాలు మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న గ్రామాల్లో మాత్రమూ అమలు కాలేదు. స్థానిక ఎన్నికల కోడ్ అమలులో ఉన్న అధికారులు కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారు .దసరా పండుగ కావడంతో గ్రామాల్లోని బెల్ట్ షాపులలో మద్యం ఏరులై పారుతుంది.గాంధీ జయంతి సందర్భంగా వైన్స్ షాప్ లు మూసివేయడం తో ఆబ్కారీ అధికారులు బెల్ట్  షాపులలో  టార్గెట్స్ పెట్టి అమ్మిస్తున్నారు.ఆబ్కారీ అధికారులు ప్రతి నెల మామూళ్లు వసూళ్లు చేస్తూ ఎలక్షన్ కోడ్ అమలు పరచకుండా ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నారు. అధికారులే అండదండలు కల్పించడంతో బెల్ట్ షాపులలో కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నట్టు ఆరోపణలున్నాయి.వైన్స్ లలో దొరికే మద్యం పై క్వాటర్ కు 30 రూపాయలు ఎక్కువ పెట్టిన మంచి మద్యం ఇస్తున్నారో లేదో అని మందు బాబులు ఆందోళన చెందుతున్నారు.దసరా పండుగ కావడంతో బెల్ట్ షాపుల నిర్వాహకులు ఫుల్ బాటిల్ పై 300 నుంచి 500 వరకు ఎక్కువ వసూలు చేస్తున్నారని తాగుబోతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు నిద్ర మత్తు వదిలి బెల్ట్ షాపుల పై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!