ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్…డీల్ పూర్తైతే అతిపెద్ద ఒప్పందం

ఆర్‌సీబీ ఫ్రాంచైజీకి కొత్త ఓనర్…డీల్ పూర్తైతే అతిపెద్ద ఒప్పందం

ఈ డీల్ పూర్తైతే ఇది ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం అవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవలే టారెంట్ గ్రూప్, గుజరాత్ టైటాన్స్‌లో 67% వాటాను కొనుగోలు చేసిన డీల్ దాదాపు రూ. 7,500 కోట్లుగా ఉంది. దీంతో ఇప్పుడు ఆర్సీబీ ఐపీఎల్ ఫ్రాంచైజీకి భారీ డిమాండ్ ఏర్పడుతోంది.

ఐపీ  ల్లో అభిమానులను ఉర్రూతలూగించే జట్టుగా గుర్తింపు పొందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓనర్ మారనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ మద్యం సంస్థ డియాజియో, ఆర్ర్సీ బీ యాజమాన్యంలో తన వాటాను విక్రయించేందుకు ప్రాథమిక ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో మరో భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీని అమ్మే ప్రయత్నం చేస్తుండగా, సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా కొనుగోలుదారుల్లో ముందంజలో ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ప్రముఖ మద్యం సంస్థ డియాజియో తనకు చెందిన ఆర్ర్సీ బీ వాటాను అమ్మేందుకు సిద్ధమవుతోంది.
దీని కోసం సిటీ బ్యాంక్‌ను ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా నియమించిందట. దియాజియో, ఈ ప్రాంచైజీకి దాదాపు $2 బిలియన్ (సుమారు రూ. 16,000 కోట్లకు పైగా) విలువను ఆశిస్తోంది. అంత పెద్ద మొత్తం ఒక్కసారిగా చెల్లించాలన్న షరతు వల్ల కొనుగోలుదారులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు సమాచారం.
ముందంజలో అదార్ పూనావాలా

ఈ డీల్‌లో ముందంజలో ఉన్న పేరు అదార్ పూనావాలా. అతిపెద్ద వ్యాక్సిన్ తయారీ సంస్థ అయిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి సీఈఓ. ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో పూనావాలా పేరు తెగ చక్కర్లు కొడుతోంది. అతని స్థాయికి తగ్గ ప్రతిష్టతోనే ఆర్ సిబీ ని కొనుగోలు చేసి మరింత రిచ్ అవ్వాలని చూస్తున్నారని పలువురు భావిస్తున్నారు.
ఆర్ సి బీ ఓ ఎగ్జైటింగ్ బిజినెస్ కానీ, ఇది మా కోర్ బిజినెస్ కాదని డియాజియో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ సోమేశ్వర్ ఇటీవల అన్నారు. అంటే ఇది వారి ప్రాధాన్యతలో లేదని స్పష్టం చేశారు. దీంతో ఆర్ సి బీఅమ్మకానికి సిద్ధమయ్యారని పలువురు చెబుతున్నారు. ఇప్పటికే సిటీ బ్యాంక్‌ను సంప్రదించడం ద్వారా, వారు సంపూర్ణంగా తమ వాటాను విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!