
తెలంగాణా లో మొదలైన పూల పండుగ పల్లెల్లో బతుకమ్మ సంబురాలు..
వీణవంకసెప్టెంబర్ 21(గోల్కొండ):
తెలంగాణా కు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు తెలంగాణా వ్యాప్తంగా ప్రతి ఊరు వాడ ప్రముఖ దేవాలయాల్లో ఆదివారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యాయి.కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రం తో పాటు నర్సింగా పూర్ గ్రామం లోని హరిహర క్షేత్రం ఉమామహేశ్వర దేవాలయం లో ఆడపడుచులు అందరూ ఒక్క చోట చేరి పూల బతుకమ్మలను మధ్యలో అమర్చి వాటి చుట్టు చేరి సాంప్రదాయ పద్ధతుల్లో “ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ..పాటలు పాడుకుంటూ, బతుకమ్మ పండుగను వైభవోపేతంగా జరుపుకున్నారు.
ప్రకృతి -పూలను ఆరాధించే పండుగ
ప్రకృతి సిద్ధంగా తెలంగాణ ప్రాంతాల్లో లభించే అందమైన, రంగు రంగుల పూలను సేకరించి బతుకమ్మలను పేర్చుతారు. చెలకలు, చేసుల్లో మొలిచే సహజ పువ్వులైన తంగేడు, గునుగు, గుమ్మడి, కట్ల పూలు, సీత జడ పూలు లాంటివి సేకరించి బతుకమ్మలను పేర్చి మధ్యలో గుమ్మడి పూవ్వును, గౌరమ్మను అమర్చి కొలుచుకుంటారు. తంగేడు పువ్వు శక్తికి, గుమ్మడి పువ్వు మంగళకరమైన సౌందర్యానికి ప్రతీకలుగా తీసుకుంటారు.
తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ అంటే బతకనిచ్చే చల్లని అమ్మ అని అర్ధం చేసుకోవాలి.
మహిళలు భక్తి శ్రద్దలతో గౌరమ్మను పూజిస్తూరోజుకో రకమైన నైవేద్యం తో సమర్పించనున్నారు ప్రతి ఏట మహాలయా అమావాస్య (పెత్రామాస లేదా పితృ అమావాస్య) రోజున 21 సెప్టెంబర్ ‘ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై తొమ్మిదవ రోజు 30 సెప్టెంబర్ 2025న ‘సద్దుల బతుకమ్మ’తో ముగుస్తుంది.


