
హుజురాబాద్ లో క్లౌడ్ బరెస్ట్…గంటలో 20 సెంటీమీటర్ల వర్షం
కరీంనగర్ సెప్టెంబరు 11 (గోల్కొండ ):
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో క్లౌడ్ బరస్ట్ తో గురువారం రాత్రి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.దింతో పట్టణంతో పాటు పల్లెల్లో రోడ్డు లు పుర్తిగా జలమయమైనాయి.పట్టణంలో పలు కాలనీలో ఇండ్లలోకి నీరు రావడంతో ఆధికారులు పునరావాస కేంద్రాలు ఎర్పాటు చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.ఒక్కసారీ కురిసిన వర్షంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి .గ్రామల్లో పంటపొలాల్లో వరద నీరు చేరింది .అనేక గ్రామల్లో ఇండ్లలోకి నీరు రావడంతొ ప్రజలూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు .పోలిస్ మున్సిపల్ ,రెవెన్యు సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
TAGS Hot News


