
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. కేంద్ర కమిటీ సభ్యుడు మృతి.
రాయపూర్ సెప్టెంబర్ 11 (గోల్కొండ ):
ఛత్తీస్గఢ్లో తాజాగా జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, వరంగల్ జిల్లాకు చెందిన మనోజ్ అలియాస్ మోదెం బాలకృష్ణ మరణించారు. ఆయనపై గతంలో రూ.2 కోట్ల రివార్డు ప్రకటించారు. గరియాబంద్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో మనోజ్ సహా మొత్తం 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఎదురుకాల్పులు ముగిసిన తరువాతే మృతులపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
TAGS Hot News


