పండుగలు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలి

పండుగలు శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలి

మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు

మంచిర్యాల సెప్టెంబరు 04 (గోల్కొండ ): పండుగలు శాంతి యుత వాతావరణం లో జరుపుకోవాలనీ మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రం లో ని వంద ఫీట్ల రోడ్డు లో అంజనీ పుత్ర రియల్ ఎస్టేట్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారిని అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్ మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి ఘనంగా సన్మానించి జ్ఞాపిక లను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా పండుగలు ఆధ్యాత్మికంగా,శాంతి యుత మార్గం లో నిర్వహించుకోవాలని అన్నారు. ఐక్యత తో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలను, నిమజ్జ నోత్సవాన్ని నిర్వహించుకోవాల న్నారు. అనంతరం అంజనీ పుత్ర సంస్థ చైర్మెన్ గుర్రాల శ్రీధర్, మేనేజింగ్ డైరెక్టర్ పిల్లి రవి మాట్లాడుతూ సామాజిక సేవలో ఆంజనేపుత్ర ఎల్లప్పుడూ ముందుంటుదన్నారు.ఈ కార్యక్రమం లో ఆంజనీ పుత్ర సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లు సూరినేని కిషన్, కాసర్ల సదానందం డైరెక్టర్ లు, స్థానిక సీఐ ,ఎస్సై, లు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!