
ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్రం ఆమోదం
… ఫలించిన ఎంపీ వంశీకృష్ణ కృషి
మంచిర్యాల: పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల నిలుపుదలకు కేంద్ర రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఎంపీ గడ్డ వంశీకృష్ణ పార్లమెంటులో రైలు ప్రయాణికుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లగా బెల్లంపల్లి, రామగుండం మంచిర్యాల రైల్వే స్టేషన్లలో సూపర్ ఫాస్ట్ రైళ్ల నిలుపుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామగుండంలో సంఘమిత్ర, భాగమతి, దక్షిణ్, రామేశ్వరం బెల్లంపల్లిలో గోరఖ్పూర్, దక్షిణ్, రక్సాల్, ఎర్నాకులం పాట్నా, పెద్దపల్లి జంక్షన్ లో దక్షిణ్ రైళ్ల నిలుపుటకు ఆమోదం లభించినట్లు వంశీకృష్ణ తెలిపారు.


