వీణవంక లో  బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా

వీణవంక లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ధర్నా

వీణవంక, సెప్టెంబర్ 02(గోల్కొండ)
మాజీ సీఎం కెసిఆర్ మీద కావాలని కుట్రపూరితంగా కేసులలో ఇరికిస్తున్న కాంగ్రేస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీణవంక మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జమ్మికుంట -కరీంనగర్ ప్రధాన రహదారి పై రహదారి పై భారీ ధర్నా రాస్తా రోఖో నిరసన చేపట్టారు.బీఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ…నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నసమయంలో నీళ్లు నిధులు నియమకాలు అభివృద్ధి అనే నినాదం తో ఉద్యమం ఏర్పాటు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఘనత కేసీఆర్ దే అని ఈ సందర్బంగా తెలిపారు.కాళేశ్వరం నీళ్ళతో తెలంగాణలో బీడులు వారిన భూములను పచ్చని పంటలతో ప్రతి పల్లెను సస్యశ్యామలం చేయడం కోసం మూడేండ్ల లో రూపకల్పన చేసి త్రాగు నీరు,రైతుల పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడిందని అన్నారు.కేసీఆర్ ను, బీ ఆర్ ఎస్ ను బద్నాం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక గోష్ కమిషన్ ను ఏర్పాటు చేసి విచారణ జరిపించి అరువందల పేజీ ల బుక్కును తయారు చేసి అసెంబ్లీ లో ఆరు గంటలు కూడా చర్చ లు చేయకుండా కేసీఆర్ మీద కక్ష్య సాధింపు లో ఇబ్బందులకు గురి చేయడాన్ని బీఆర్ ఎస్ పార్టీ పూర్తి గా వ్యతిరేకం చేస్తుందన్నారు.

గతం లో ఎప్పుడు యూరియా కొరత లేదు

బీఆర్ ఎస్ పాలనలో గడిచిన పదేండ్ల లలో ఎప్పుడు రైతులు యూరియా కోసం రోడ్డు ఎక్కలేదని ప్యాక్స్ చైర్మన్ మావురపు విజయ్ భాస్కర్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం రైతులు యూరియా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థులు ఏర్పడుతున్నాయని అన్నారు.కేసీఆర్ మీద ప్రతీకార రాజకీయాలు చేయడం సరికాదని, వెంటనే ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు.ఇక్కడ మండల బీఆర్ఎస్ నాయకులు వాలా బాలకిషన్ రావు, మాడ సాధవ రెడ్డి, ముసిపట్ల తిరుపతి రెడ్డి,నీల కుమార్, కాసర్ల సుధాకర్,కామిడి శ్రీనివాస్ రెడ్డి,తాళ్ళ పెల్లి మహేష్, యాసిన్,పోతుల నర్సయ్య, సత్యనారాయణ,తో పాటుమాజీ ప్రజా ప్రతినిధులు ఉన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!