
హరీష్ రావు, సంతోష్ రావు పై …ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు
హైదరాబాద్ సెప్టెంబర్ 01 (గోల్కొండ ):
కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఇందులో ఆ ఇద్దరిదే కీలకపాత్ర.. కేసీఆర్ బలిపశువును చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. బీఆర్ఎస్ కీలకనేత హరీష్‌రావును టార్గెట్ చేస్తూ మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరు, ముగ్గురు నేతలే కేసీఆర్‌పై కుట్రలకు పాల్పడుతున్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్‌రావు, సంతోష్‌ది కీలకపాత్ర అని వెల్లడించారు. వీరిద్దరి వెనక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని.. వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. నేనిప్పుడు మాట్లాడితే నా వెనుక ఎవరో ఉన్నారంటారని.. కానీ, అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు బాధ్యుణ్ణి చేస్తూ మా నాన్నపై సీబీఐ విచారణ వేశారు. మా నాన్నకు డబ్బు, తిండిపై ఏనాడూ యావ లేదు. మా నాన్న పరువు పోతే మాకు బాధ.. వాళ్లకు ఏం లేదు. నా కడుపు మండిపోతోంది. అవినీతి అనకొండల మధ్య కేసీఆర్ బలిపశువు అవుతున్నారని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టుకున్నారు.


