
విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారు
మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య
విధి నిర్వహణలో మసూద్ అలీ చిత్తశుద్ధిని చాటారని, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులకు సన్నితంగా మెలిగి ఎవరినీ నొప్పించకుండా ఒప్పించే మంచితనం మసూద్ అలీ సొంతమని మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ ఉప్పలయ్య అన్నారు. శనివారం సాయంత్రం ఐ లైఫ్ కన్వెన్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న ప్రజా ప్రతినిధులు రిటైర్డ్ ఎం ఈ మసూద్ అలీ సేవలను కొనియాడారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సుధాముల్ల హరికృష్ణ, శ్రీపతి శ్రీనివాస్, పోరెడ్డి రాజు, గాదె సత్యం, పల్లపు తిరుపతి, రామగిరి బానేష్ ఆయన సేవలను కొనియాడారు. మంచిర్యాలతో 20 సంవత్సరాల అనుబంధం ఉన్న ఆలీ విధి నిర్వహణలో చిత్తశుద్ధిని చాటారని అభినందనలతో ముంచేత్తారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి కమిషనర్ రాజ మనోహర్, మేనేజర్ సొల్లురి కరుణాకర్, వాటర్ ఏ ఈ రాజేందర్, అధికారులు మురళి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.



