ఏసీబీ వలలో చిక్కిన   చల్లూరు పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ వలలో చిక్కిన చల్లూరు పంచాయతీ కార్యదర్శి

ఇల్లు పర్మిషన్ ఇంటి నెంబర్ కేటాహించడం కోసం 20 వేయిలు డిమాండు
టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్థులు

వీణవంక ఆగస్టు 29 (గోల్కొండ )
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరు గ్రామంలో ఇంటి నెంబర్ కేటాహించేందుకు పంచాయతీ కార్యదర్శి  కుంభం నాగరాజు  20 వేయిలు డిమాండ్ చేయడంతో అదే గ్రామానికి చెందిన బాధితుడు ఏసీబీ ని ఆశ్రహించగా శుక్రవారం బాధితుడి నుంచి 20 వేయిలు తీసుకుంటుండగా ఏసీబీ డీస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పట్టుకున్నారు.లబ్ధిదారుడు మీసేవలో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ చలాన్ కట్టినాక లబ్ది దారుణ్ని గత కొద్దీ రోజులుగా ఇబ్బంది పెడుతూ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రహించగా పక్కాగా నిఘా వేసి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారు.పంచాయతీ కార్యదర్శిని పట్టుకోవడంతో గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు . గత కొంత కాలంగా గ్రామంలో ప్రతి పనికి డబ్బులు ఇవ్వందే పనులు చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోనూ ప్రతి లబ్ది దారుడినుంచి దాదాపు ముప్పై వేయిలు ఇస్తేనే బిల్లులు మంజూరు చేశారని ఆరోణలున్నాయి. ఏసీబీ అధికారుల దాడులతో మండలంలో అధికారుల పనితీరుపై చర్చ మొదలైంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!