మున్సిపల్ కాంట్రాక్ట్  కార్మికుల హక్కుల  సాధనే లక్ష్యం

మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం

మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ

మంచిర్యాల: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల సాధనే లక్ష్యం గా ముందుకు సాగుతున్నట్లు మంచిర్యాల జిల్లా కాంట్రాక్ట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ తెలిపారు. మంచిర్యాల్ కార్పొరేషన్ బల్దియా పరిధిలోని గుడిపల్లిలో పారిశుద్ధ కార్మికులు తమ సంఘంలో చేరినట్లు వెల్లడించారు. మంచిర్యాల కార్పొరేషన్ పనిచేస్తున్న కార్మికులతో సమానంగా 17,500 వేతనం ఇవ్వాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని కార్మికులకు రావలసిన ప్రతి హక్కును ఇప్పించేందుకు తమ సంఘం ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలిపారు అదేవిధంగా మీకు 17,500 వేతనం ఇప్పించేందుకు కమిషనర్, జిల్లా కలెక్టర్ కు తెలియజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో నూతన కమిటీ అధ్యక్షులు చిప్పకుర్తి అశోక్ , ఉపాధ్యక్షులు మిట్ట సంపత్, ఆత్మకూరి మల్లేష్, గాలి పల్లి వెంకటస్వామి, చిప్పకుర్తి మహేందర్, చీమల రాజ్ కుమార్, నడిమెట్ల పోశం, మదినేని రాజబాబు లు పాల్గొన్నారు. దీనికి ముందర హరికృష్ణ ను కార్మికులు శాలువాతో ఘనంగా సన్మానించారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!