హుజూరాబాద్ లో వర్షం బీభత్సం .ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం… ప్రణవ్

హుజూరాబాద్ లో వర్షం బీభత్సం .ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం… ప్రణవ్

నీట మునిగిన పట్టణలోని కాలనీలు

వర్షం నీరుతో నీటమునిగిన మొబైల్ షాప్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని గాంధీనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతాలను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ పరిశీలించి,బాధితులతో నేరుగా మాట్లాడి నష్టాల పై అరా తీశారు.
హుజూరాబాద్ లోని బుడుగ జంగాల కాలనీ, గణేష్ నగర్, ఇల్లందులవాడ, మామిళ్ళవాడ, గాంధీనగర్, కాకతీయ కాలనీ, ఇందిరా నగర్, కొత్తపల్లి, ముక్కపల్లి, బోర్ణపల్లి, థమక్కపేట, నర్సింగాపూర్ రోడ్లన్నీ జలమయం కావడంతో పలువురి ఇళ్లలోకి నీళ్లు చేరాయి. డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో పలు దుకాణాలు నీట మునిగాయి.గురువారాం రాత్రి కురిసిన వర్షంతో పట్టణ మొత్తం జలమయంగా మారింది.జూట్ బ్యాగుల ఇండస్ట్రీ నీట మునిగి రెండు టన్నులసరుకు నీళ్ల పాలై తీవ్ర నష్టం జరిగిట్లు యజమానులు తెలిపారు.
వర్ష ప్రభావిత ప్రాంతాలను హుజూరాబాద్ ఆర్డీఓ రమేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, తహశీల్దార్ కనకయ్య లు పట్టణం లో సందర్శించారు.నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వ పరంగా సహాయం అందింస్థామని తెలిపారు.గంటలో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!