శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్న… వొడితల ప్రణవ్

ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి.
కరీంనగర్ ఆగస్టు 16 (గోల్కొండ ):కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణుడిని కోరుకుంటున్నానని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ అన్నారు .శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా జమ్మికుంట,హుజురాబాద్ పట్టణాల్లో నిర్వహించిన శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు . కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.చిన్నారులు శ్రీ కృష్ణుని వేషధారణలో ఉండగా వారిని దగ్గరికి తీసుకుని ముచ్చటించారు. ఉట్టికొట్టే కార్యక్రమాన్ని స్వయంగా వీక్షించారు .ఈ కార్యక్రమంలో జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ అయాజ్,టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్,నిర్వాహకులు రాజు యాదవ్,పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!