రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

ఢిల్లీ ఆగస్టు 12 (గోల్కొండ ) : తెలంగాణ రాష్ట్రంలో ఆరాచక పాలనా కొనసాగుతుందని హిందువులు పెద్దమ్మ గుడికి పోతే తప్పేముందని కాంగ్రెస్ ప్రభుత్వం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండి పడ్డారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావును గృహ నిర్బంధం చేయడం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంఘాలు నిర్వహించే కుంకుమార్చన కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. పెద్దమ్మ గుడికి హిందువులు పోతే తప్పేంది..? భాగ్యనగర్‌లో హిందూ సంఘాలను, బీజేపీ కార్యకర్తలందరినీ అరెస్ట్ చేయడం మూర్ఖత్వం. ఒక పథకం ప్రకారమే కాంగ్రెస్ వ్యవహారిస్తున్నట్లు కనిపిస్తోంది. పెద్దమ్మ గుడిని కూల్చిన గూండాలను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా పూజలు నిర్వహించే హిందూ సంఘాల నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఒక వర్గం ఓట్ల కోసం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి కుట్రలు చేస్తోంది. ఒక వర్గం ఓట్ల కోసం హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటోంది. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ది చెప్పే రోజులు త్వరలోనే రాబోతున్నాయి’ అని బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!