బీహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి ….

బీహార్ లో ఎన్డీఏ సీట్ల పంపకం పూర్తి ….

పాట్నా అక్టోబరు 12 (గోల్కొండ) : బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భాగస్వాముల మధ్య ఆదివారంనాడు సీట్ల షేరింగ్ ఫార్ములా ఖరారైంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారికంగా సామాజిక మాధ్యమంలో ఇందుకు సంబంధించిన వివరాలు ప్రకటించారు. సీట్ల కేటాయింపులో భాగంగా భారతీయ జనతా పార్టీ , జనతా దళ్ యునైటెడ్ చెరో 101 సీట్లలో పోటీ చేయనున్నాయి. భాగస్వామ్య పార్టీలైన లోక్‌జన్ శక్తి కు 29 సీట్లు కేటాయించారు. రాష్ట్రీయ లోక్‌ మోర్చా కు 6 సీట్లు, హిందుస్థాన్ అవామీ మోర్చా కు 6 సీట్లు కేటాయించారు.ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఈ కేటాయింపులను స్వాగతించినట్టు కూటమి నేతలు వెల్లడించారు. తమ కూటమి బిహార్‌లో తిరిగి అధికారం చేపట్టగలదనే ధీమాను వ్యక్తం చేశారు.
షెడ్యూల్ ప్రకారం, బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో జరుగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడతాయి.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!