బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు

హైదరాబాద్ మార్చి31(గోల్కొండ ):
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. కౌశిక్ రెడ్డితో పాటు మరో 20 మందికి సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 4న హైదరాబాద్‌లో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. జనవరి 29న సమ్మక్క – సారలమ్మ జాతర సందర్భంగా హుజురాబాద్‌లో కౌశిక్ రెడ్డి హంగామా చేసిన విషయం తెలిసిందే. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో కౌశిక్‌ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. హుజురాబాద్‌లో నమోదైన కేసును ప్రభుత్వం సీఐడీకి బదిలీ చేసింది. ఈ కేసుపై సీఐడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు నోటీసులు ఇచ్చిన సీఐడీ.. ఏప్రిల్ 4న హైదరాబాద్‌ లక్డీకాపూల్‌లో ఉన్న సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాల్సిందిగా స్పష్టంగా పేర్కొంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!