
ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ ఫలాలు…ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన…

పెద్దపల్లి ఆగస్టు 27 (గోల్కొండ ):
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని శివపల్లి గ్రామంలో బుధవారం రోజున సి.సి రోడ్డు, పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కోసం ₹30 లక్షల రూపాయల నిధులతో పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు, పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అన్నారు. దేశంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సగర్వంగా చాటి చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల మంది రైతులకు రూ 21 వేల కోట్లు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తులను చేశామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం సన్న వడ్లకు బోనస్ చెల్లించామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తామని పేర్కొన్నారు. యాసంగిలో 9 రోజుల్లో రాష్ట్రంలోని రైతులకు 9 వేల కోట్లు రైతు భరోసా అందించి రికార్డు సృష్టించామని తెలిపారు. రైతులను రాజులను చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 వంట గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిలిచారు మరియు బి.ఆర్.ఎస్ బిజెపి పార్టీలు పొంతన లేని మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు అలాగే రైతులకు యూరియా అందడం లేదని బిఆర్ఎస్ నాయకులు చెప్పులు లైన్ లో పెడుతూ రైతులను, ప్రజలను మభ్యపెడుతున్నారని ప్రజలు అన్నీ గమనిస్తున్నారని రానున్న రోజుల్లో ఆ పార్టీ నాయకులకు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు యూరియా అందించాలని అన్నారు. బిజెపి 8 మంది ఎంపి లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో కొట్లాడి రాష్ట్ర రైతంగానికి యూరియాను అందించాలని కోరారు అలాగే రైతులకు విజ్ఞప్తి పంటలకు నానో యూరియా వాడితే మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. మరియు నానో యూరియా వల్ల మొక్కలపై పిచికారీ చెయ్యడం వల్ల చీడ పురుగులు వివరించవచ్చని అన్నారు స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పేర్కొన్నారు…


