దూసుకొచ్చి… దోచుకెళ్లారు ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..

దూసుకొచ్చి… దోచుకెళ్లారు ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..

అసిస్టెంట్ మేనేజర్ పై కాల్పులు
ఖజానా జ్యువెలరీ షాప్‌లో దోపిడీ..
హైదరాబాద్ ఆగస్టు 13 ( గోల్కొండ )
హైదరాబాద్ నగరంలో దొంగలు మరోసారి రెచ్చిపోయారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీ షాప్ లోనూ ఈ ఉదయం ఆరుగురు దొంగలు చోరీకి పాల్పడ్డారు. అప్పుడే షాప్ ఓపెన్ చేసి ఉదయం 10.30 గంటలకు ప్లెడ్జ్ చేస్తున్న సిబ్బందిపైకి ఒక్కసారిగా దూసుకువచ్చిన ఆరుగురు నిందితులు అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరిపారు.
దీంతో ఆయన కాలులోకి బులెట్ దూసుకుపోయింది. కాల్పులలతో ఒక్కసారిగా భయపడిన జ్యువెలరీ షాప్ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. దొంగలు అందినకాడికి దోచుకుని పరారయ్యారు. ఎక్కువగా వెండి వస్తువులు, బంగారం చోరీకి గురైనట్లు తెలుస్తుంది. గాయపడిన అసిస్టెంట్ మేనేజర్ సతీష్‌ను దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు చోరీ జరిగిన ఖజానా జ్యువెలరీ షాప్ వద్దకు చేరుకుని క్లూస్ సేకరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నారు. అలాగే దొంగలు జహీరాబాద్ వైపు పారిపోగా.. జిల్లా సరిహద్దు పోలీసులను అధికారులు అప్రమత్తం చేశారు. దొంగలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!