
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావాలని .. రామయ్యను కోరుకున్న -ఎంపీ ఈటల రాజేందర్
కరీంనగర్, ఏప్రిల్ 04(గోల్కొండ ):హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి రథోత్సవ కార్యక్రమానికి మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కలు చెల్లించుకొని రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లందకుంట సీతారామచంద్ర స్వామి ఆలయం శ్రీరాముడు నడిగాడిన ప్రాంతంగా పేరుగాంచింది.. స్వయంభు దేవాలయం. వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయం కట్టబడిందన్నారు.
ఈ చుట్టుపక్క ప్రాంత ప్రజలందరూ వేలాదిగా తరలివచ్చి సీతారామ కళ్యాణోత్సవం మొదలుపెట్టి రథోత్సవం వరకు గొప్పగా నిర్వహించుకుంటున్నారని అన్నారు.ఈ ఆలయాన్ని గొప్పగా నిర్మించుకోవాలని పాత ఆలయం కి సౌకర్యాలు పెంచి గ్రామస్తుల సహకారంతో గొప్ప రథాన్ని నిర్మాణం చేసుకున్నామని తెలిపారు.ఈ ఆలయ ప్రాంగణమంతా కొన్ని కోట్ల రూపాయలతో బాగు చేయించాము.వేలాదిమంది ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు, అనేక దైవిక కార్యక్రమాలు జరుపుకునేందుకు వీలుగా..ఈ ప్రాంత ప్రజలకు సౌకర్యాలు ఉండాలని రెండు పెద్ద షెడ్డులు నిర్మాణం చేయడం జరిగిందన్నారు.ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆలయంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న కాలంలో గొప్పగా అభివృద్ధి చేశాము. రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేసుకుందామని,
వేలమంది భక్తులు ఇక్కడికి వచ్చేలా చేయడంలో ఇక్కడ ఉన్న యాజమాన్యం తోడ్పాటు అందించాలని కోరారు.రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావచ్చి ప్రజలకు మంచి జరగాలని కోరారు.


