
తుఫాన్ బాధితులను పరామర్శించిన సీఎం చంద్రబాబు…

అమరావతి అక్టోబరు 29 (గోల్కొండ ):
మెంథా తుఫాను బాధితులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయకుడు బుధవారం పరామర్శించారు.
మొంథా తుఫాను బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటోంది. బాధితులకు నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేస్తోంది. అంతేకాకుండా, తుఫాన్ బాధితుల కుటుంబానికి రూ.3 వేల చొప్పున ప్రత్యేక ఆర్థిక సాయం అందిస్తోంది.
మొంథా తుఫాను పెను విపత్తు అని, దీని వల్ల ఏపీకి తీవ్ర నష్టం వాటిళ్లిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. గతంలో తుఫాన్ల సమయంలో పనిచేసిన అనుభవం తనకుందని గుర్తుచేశారు. మొంథా తుఫాన్‌పై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.
తుఫానుపై ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బుధవారం కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఓడలరేవులో తుఫాన్ బాధితులను సీఎం పరామర్శించారు. తుఫాన్ బాధితులకు నిత్యావసరాలు, రూ.3వేలు పరిహారం అందజేశారు. మత్స్యకారుల కుటుంబాలకు 50కిలోల బియ్యం అందించారు. అలాగే, అల్లవరం మండలంలోని బెండమూరులంక రేవులో పడిపోయిన కొబ్బరి చెట్లను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కోనసీమ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో వరి, ఆక్వా, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని చెప్పుకొచ్చారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షం నమోదైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆస్తి నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని స్పష్టం చేశారు. కౌలు రైతులకు పరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి రూ.3వేలు, రేషన్ సరుకులు ఇస్తున్నామని ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలకు 50కిలోల బియ్యం అందజేస్తామని చెప్పుకొచ్చారు. సాధారణ కుటుంబాలకు 25కిలోల బియ్యం, నిత్యావసరాలు అందజేస్తామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.


