
గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వ విప్
వేములవాడ ఆగస్టు 29 (గోల్కొండ ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ములవాగు ఉదృతంగా ప్రవహించడంతో వేములవాడ పట్టణంలోని బతుకమ్మ తెప్ప వద్ద రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గంగమ్మ తల్లికి చీర ,పసుపు కుంకుమ తో ప్రత్యేక పూజలు నిర్వహించారు*
కరీంనగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ 15వ వర్ధంతి సందర్బంగా సత్తయ్య ఘాట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ తో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం,చింతకుంట విజయరమణ రావు తో కలసి స్వర్గీయులు పొన్నం సత్తయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వేములవాడ పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీశైలం తండ్రి కూరగాయల పోశెట్టి గారు మరణించగా బౌతికాయనికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు.
మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ గారి కుమారుడు పెద్దాపూర్ లోని కెనాల్ లో పడి గల్లంతు కాగా విషయం తెలుసుకొని శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.వీరి వెంట నాయకులూ ,కార్యకర్తలు ఉన్నారు .


